![]() |
![]() |
.webp)
ముంబైలో ఉన్న సెలబ్రిటీల ఇళ్ల మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. వాళ్లు ఉంటున్న అపార్ట్ మెంట్ల గురించి చాలా చాలా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కోవలో లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతున్నది విక్కీ కౌశల్ అపార్ట్ మెంట్. కత్రినా కైఫ్ ఉంటున్న అపార్ట్ మెంట్ గురించి. విక్కీ కౌశల్‌ని కత్రినా కైఫ్ 2021 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే దాని గురించి వారెప్పుడూ నోరు విప్పి మాట్లాడలేదు. పెళ్లి తర్వాతే వారి బంధం గురించి బయటపెట్టారు. పెళ్లికి ముందు కత్రినా ఆమె సోదరితో ఓ అపార్ట్ మెంట్‌లో ఉండేవారు. కానీ పెళ్లయ్యాక ఆమె కొత్త అపార్ట్ మెంట్‌కి షిఫ్ట్ అయ్యారు. పెళ్లి తర్వాత సీ ఫేస్డ్ హౌస్‌లో ఉండాలని ముందే నిర్ణయించుకున్నారట. దీని గురించి అప్పట్లో వార్తలు వచ్చినా, ఇప్పుడు వాళ్ల ఇంటి పిక్చర్స్ బయటకు వచ్చేసరికి మరోసారి వీళ్ల సీ ఫేస్డ్ అపార్ట్ మెంట్ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ అపార్ట్ మెంట్ వారిద్దరికీ చాలా బాగా కలిసి వచ్చిందట. ఈ ఫ్లాట్‌లో ఎవరు ఉన్నా సరే, దాంపత్యంలో అన్యోన్యంగా ఉంటారని పండితులు చెప్పారట. అంతే కాకుండా ఐశ్వర్యం, ప్రశాంతత ఉండేలా వాస్తు కనిపిస్తోందని చెప్పారట. కత్రినా కైఫ్ ప్రస్తుతం మెర్రీ క్రిస్మస్, టైగర్ 3లో నటిస్తున్నారు. మెర్రీ క్రిస్మస్‌లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, కత్రినా ఇద్దరూ గ్రే షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపిస్తారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. అటు టైగర్ 3లో సల్మాన్‌ఖాన్ హీరో. స్పై థ్రిల్లర్ మూవీ ఇది. గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ చాలానే ఉంటాయి. ఈ సినిమాను దివాళికి విడుదల చేయాలన్నది ప్లాన్. విక్కీ కౌశల్ ఇప్పుడు లక్ష్మణ్ ఉటేకర్ నెక్స్ట్ సినిమాలో నటిస్తున్నారు. గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, శామ్ బహదూర్ కూడా విడుదలకున్నాయి. ఆనంద్ తివారితో చేస్తున్న సినిమా ఆగస్టులో విడుదల కానుంది. శామ్ బహదూర్ డిసెంబర్ నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.
![]() |
![]() |